జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : దేశంలోని 18 రకాల చేతి వృత్తులవారికి, కళాకారులకు చేయుతనందించి వారి అభివృద్ధికి బాటలు వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం నేటికి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు లబ్దిదారులతో కార్యక్రమాన్ని నిర్వహించగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ప్రత్యక్ష ప్రసారాన్ని వర్చువల్ గా ఏర్పాటు చేయగా 1000 మంది లబ్ధిదారులు వీక్షించారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యాదగిరి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్, టి.వి.ఎన్ ఉషేంద్ర రావు RDSDE అసిస్టెంట్ డైరెక్టర్ ఈ పథకం ముఖ్య ఉద్దేశాలను అధికారులు వివరించి అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికేట్ లు ప్రదానం చేశారు. విశ్వకర్మ యోజనలో భాగంగా వడ్రంగి, పడవల తయారీ, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, రజకులు, క్షురకులు, బట్టలు కుట్టేవారు ( దర్జీలు) శిల్పకారులు, చర్మకారులు, చెప్పులు కుట్టేవారు, తాపి పని వారు, బుట /చాప / చీపుర్లు తయారు చేసేవారు, బొమ్మల తయారీ దారులు, చేపలు పెట్టేవారికి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మొదటి విడత 1 లక్ష రూపాయల రుణాలు అందిస్తారు. రెండవ విడత 2 లక్షల రూపాయలు మొత్తం 3 లక్షల రూపాయలు రుణాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. చేతివృత్తులవారికి 5 నుండి 7 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అలాగే 15 వేల విలువ గల పరికరాల కిట్టుతోపాటు సర్టిఫికెట్ అందజేస్తారు. చేతి వృత్తులు చేసుకునే వారికి లక్ష నుండి 3 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వెయ్యి మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని వారందరికీ ఒక లక్ష రుణాలను అందించడం జరుగుతుందని తెలిపారు. చేతివృత్తులవారికి 5 నుండి 7 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అలాగే 15 వేల విలువ గల పరికరాల కిట్టుతోపాటు సర్టిఫికెట్ అందజేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.