- బాలినేని రాజీనామాతో బూచేపల్లికి జిల్లా పార్టీ పగ్గాలు అందించిన వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్.
ప్రకాశం జిల్లా వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షునిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధికారికంగా తెలియజేశారు.
దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి తో వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలోనే ఇప్పటివరకు జగన్ కు, బూచేపల్లి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధంతో బాల్నేని శ్రీనివాసరెడ్డి పార్టీని వదిలి వెళ్లడంతో జిల్లాలో పార్టీని సమర్థవంతంగా నడపగల సామర్థ్యం దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి ఉందని భావించి జగన్ అతనికి ప్రకాశం జిల్లా పార్టీ పగ్గాలు అందించారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభంజనంలో సుమారు 164 మంది ఎమ్మెల్యేలు కొట్టుకొని పోగా, గెలిచిన 11 మందిలో శివప్రసాద్ రెడ్డి ఒకడు కాగా, దర్శి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీపై 2000 ఓట్ల మెజార్టీ తో గెలిచాడు.