- మొత్తం 31మందిపై కేసు నమోదు
- మిగతా 15 మంది త్వరలోనే పట్టుకుంటాం
- తూప్రాన్ డిఎస్పీ సోమ వెంకట్ రెడ్డి
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలం గౌతోజి గూడ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ బహిష్కరణ ఘటన కేసులో గురువారం రోజు ముగ్గురిని, శుక్రవారం రోజు 13 మంది ని ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులో అదుపులోకి తీసుకొని మొత్తం 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ డిఎస్పీ సోమ వెంకట్ రెడ్డి తెలిపారు. గౌతజి గూడ గ్రామంలో డప్పు కొట్టమంటే కొట్టడంలేదని ఓ దళిత కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన ఘటనలో మొత్తం 31 మందిపై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, శుక్రవారం రోజు కు మొత్తం 16 మందికి మెడికల్ టెస్టులు నిర్వహించిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. మిగతా 15 మందిని త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తామని డిఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు.