మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో గ్రామంలో జరిగిన సంఘటన పై సీనియర్ న్యాయవాది, పౌర హక్కుల సంంఘం నేత రఘునాధ్ గట్టిగా వాదనలు వినిపించారు. ఎస్పి కలెక్టర్ ను బాధ్యులను చెస్తు హై కోర్టు ఆదేశించారని తెలిపారు. మరొ చుండూరు, కారంచెడులో గతంలో జరిగినట్టు ఈ గ్రామంలో జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అందరిని సమానంగా చూసి కులమత వర్గ వారిని సమానంగా చూడాలన్నారు. వారి హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. పోలీసు వారు గ్రామాలలో ఇలాంటి ఘటనలు జరగకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.