సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా ఒంగోలు అన్నవరప్పాడులోని శివం నిత్యాన్నదాన శరణాలయంలో శనివారం పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చీమకుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు యడ్లపల్లి రాంబ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌కు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నగరంలోని పి.వి.ఆర్.బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు, వస్త్రాల పంపిణీ జరిగింది. ఆశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం శరణాలయంతో పాటు నగరంలోని పలు ప్రదేశాలలో సుమారు 400 మంది అనాధలు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పూరి చలమయ్య మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే గొప్పవ్యక్తి బి.ఎన్.విజయ్ కుమార్ అని, ఆయన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో నిరాడంబరంగా ఉంటూ నిరంతరం ప్రజాసేవకు అంకితమయిన గొప్ప నాయకుడు బి.ఎన్.విజయ్‌కుమార్ అన్నారు. శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ శాసనసభ్యులు బి.ఎన్.విజయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా తమ శరణాలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో చీమకుర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్వూరి చలమయ్య, కూరాకుల కరుణాకర్ రెడ్డి, యడ్లపల్లి సురేష్, యలమంచిలి నాగేశ్వర రావు, ఉన్నం మురళి, గుడిపూడి అనిల్, లోకేష్ ఎం చౌదరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.