contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం : ఎమ్మెల్యే జూలకంటి

  • ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి ఇచ్చి చూపించాం
  • ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటాం అమలు చేసి తీరుతాం
  • దీపావళి కానుకగా ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్ పంపిణి
  • వందరోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజల్లో ఇంకా పెరిగిన ఆదరణ
  • కారంపూడి లో ప్రస్తుతం పంపిన ప్రతిపాదనలు దిశగా రెండు కోట్లకు పైగా సిసి రోడ్లు నిర్మాణానికి శ్రీకారం
  • “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జులకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడి

 

రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్నీ పల్నాడు జిల్లా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిర్వహించారు ముందుగా కార్యక్రమంలో భాగంగా కారంపూడి ఇంద్రానగర్ కాలనీ లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకి అందే సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు అనంతరం తాహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా మాటిచ్చిన రోజు నుంచి ప్రభుత్వం ఏర్పడేంతవరకు ఎన్ని రోజులు అయిందో అన్ని రోజులకు అవ్వ తాతలు కలిపి ఒకేసారి 7000 పెంచిన పెన్షన్ ఇచ్చామని.

రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉంటామని అలాగే దీపావళికి కానుకగా ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అలాగే ప్రమాణ స్వీకారం రోజునే మెగా డిఎస్పి ఫైల్ పై తొలి సంతకం చేసామని అనుకోకుండా వచ్చిన ప్రకృతి విపత్తుకి సైతం లెక్కచేయకుండా వయసుని ఆరోగ్యాన్ని పక్కనబెట్టి ప్రజాక్షేమమే తన అజెండాగా ముందుకు సాగుతూ వానలు వరదలు అని కూడా చూడకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆహార పదార్థాలు నిత్యతర సరుకులు అందజేయడమే కాకుండా బురదమయం అయిన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చి తానేంటో ప్రపంచానికి చూపించాడని అలాగే కారంపూడి పట్టణంలోని ప్రస్తుత ప్రతిపాదనలని పరిశీలించి దాదాపు రెండు కోట్లు 32 లక్షలు గా సిసి రోడ్లు నిర్మాణానికి కేటాయింపుకి కృషి చేస్తున్నామని అలాగే నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో చేసి చూపిస్తామని కులమత బేధాలు లేకుండా ప్రతి అర్హులకు సంక్షేమ పథకాలు పెన్షన్లు అందజేస్తామని త్వరలోనే నూతన పెన్షన్లకి శ్రీకారం చుడుతున్నామని అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖునే తమ ఖాతాలో వారి జీతభత్యాలు వేస్తున్నామని అలాగే గత ప్రభుత్వంలా కాకుండా ఎవరిపై ఎలాంటి కక్షపూరిత చర్యలు కాని దౌర్జన్యాలు గాని కబ్జాలు గాని లేని స్వచ్ఛమైన ప్రజాస్వామ్య పార్టీలుగా అవతరించిన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాహసిల్దార్. ఎంపీడీవో. మరియు అన్ని శాఖల అధికారులు జిల్లా నాయకులు పంగులూరు అంజయ్య. మండల నాయకులు ఉన్నం లక్ష్మీనారాయణ. చప్పిడి రాము. బోల్నేటి శ్రీను. కటికల బాలకృష్ణ. గోళ్ళ సురేష్ యాదవ్. తండా మస్తాన్ జానీ. షేక్ మోదిన్షా. కర్ణ అమర్ నాగ సైదారావు. ఎస్ పి ఆర్ కృష్ణ. బిజెపి నాయకులు శెట్టి హనుమంతరావు. మునుగోటి సత్యం. మరియు ఇతర కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆశా వర్కర్లు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :