గడ్డపారతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేటలో జరిగింది. భూ తగాదాల నేపథ్యంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన అన్న కొడుకుపై గడ్డపారతో దాడి చేశాడు. దీంతో ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది