విజయవాడ వరద బాధితుల సహాయార్థం చీమకుర్తి సుదర్శన గ్రానైట్స్ అధినేతలు నూనె వెంకట సుబ్రహ్మణ్యం, నూనె వీరాంజనేయులు నూనె హేమ సుందర్ రావు, నూనె వంశీకృష్ణ , అనుదీప్, కొంకి మల్ల చంద్రమౌళి లు వెలగపూడి సచివాలయంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి సుదర్శన్ గ్రానైట్స్ అధినేతలను అభినందించారు.
ఈ సందర్భంగా నూనె వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న విజయవాడ వరద బాధితులకు తన వంతు సహాయం చేయటం ఎంతో మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు. తదుపరి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.