తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్యగారిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ సమావేశంలో పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి పాల్గొని వందరోజుల పాలన గురించి ప్రసంగించారు.రమణయ్యగారిపల్లికి చేరుకున్న తమ అభిమాన నాయకుడు పులివర్తి నానికి యువత టపా కాయలు పేల‌్చుతూ హర్షద్వానాల చేస్తూ ఉండగా,మహిళలు మంగళ హారతులు పడుతూ అపూర్వంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావులు మాట్లాడుతూ రమణయ్యగారిపల్లిలో ఆర్.ఓ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందని,అలాగే ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఇవ్వడం,స్టిక్కర్లు అంటించడం జరిగిందని పేర్కొన్నారు.ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి,ఎన్నో కష్టాలను అధిగమించి 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్యగారిపల్లి పంచాయతీలో అధికారులు,మండల కూటమి పార్టీల నాయకులతో కలిసి”ఇది మంచి ప్రభుత్వం”ప్రజావేదికను నిర్వహించారు.
మా పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,యువ నాయకుడు ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి తాను కంకణ బద్ధుడై పని చేస్తానని చెప్పారు.రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపైనే దృష్టి సారిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండదండలతో తనదైన శైలిలో పాలన ప్రారంభించారని చెప్పారు.గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమైపోయాయని,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా మారిందని తెలిపారు.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరకుపోయి ఉండినా నెమ్మదిగా పరిస్థితిని చక్కబెట్టుకుంటూ 100 రోజుల పాలనను ప్రజా సంక్షేమం,అభివృద్ధి వైపు సాగించినట్లు వివరించారు.
సూపర్ సిక్స్ పథకాల అమలుకు శ్రీకారం….
ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఉమ్మడిగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనుంచే కార్యరూపం ఇచ్చారని తెలిపారు.జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించే విద్యా శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి మెగా డీఎస్సీ నోటిఫికేషన్,అవ్వ తాతలకు,ప్రత్యేక ప్రతిభావంతులు తదితరులుకు అందించే ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను పెంచడం వంటి వాటిపై సంతకాలు చేసి,వాటికి కార్యరూపం ఇచ్చారని చెప్పారు.పాలన చేపట్టిన తొలి రోజుల్లోనే రైతన్నలకు ఆలంబనగా రాయతీతో విత్తనాలను అందించారన్నారు.రైతులను భయపెట్టే విధంగా గత ప్రభుత్వం రూపొందించిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేశారని తెలియజేశారు.వరదల రూపంలో అనుకోని విధంగా విజయవాడకు ఆపద వస్తే పది రోజుల పాటు వాహనంలో నిద్రించి వరద నీటిలోనే తిరుగుతూ ప్రజలకు తానున్నానంటూ భరోసా కల్పించిన నిజమైన అరుదైన నాయకుడు మా పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వర్ణించారు.ఉద్యోగస్తులకు వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ఒకటవ తేదీనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.ఇన్ని విజయాలు ప్రజల అండదండలతో సాధించగలిగినట్లు సభా ముఖంగా ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు,మాజీ జెడ్పిటిసి సురేష్ చౌదరి,ఎంపీటీసీ విజయసింహ రెడ్డి,షాజహాన్ భాష,జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్,సర్పంచ్ యువరాజు, మధు నాయుడు,ఆనంద చౌదరి,కృష్ణమనేని సావిత్రి, ఎంపీపీ లోకనాథం,ఎంపీడీఓ,తాసిల్దార్లు,ఇతర శాఖల అధికారులు, సచివాలయ కార్యదర్శులు,సిబ్బంది, శివారెడ్డి ప్రకాష్, పురుషోత్తం రెడ్డి,కూటమి మండల నాయకులు,కార్యకర్తలు,యువత,మహిళలు పాల్గొన్నారు.