శ్రీకాకుళం జిల్లా లో ఆర్మీ ర్యాలీ పేరిట తొమ్మిది వందల మందిని మోసం చేసిన బసవ వెంకటరమణ , నేవీ లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాలుపడి సర్వీస్ నుండి డీబార్ అయినా రాజు , వీరిద్దరూ ఎపి పోలీసులకు టోకరా వేసి కరీంనగర్ పట్టణంలో జ్యోతి నగర్ లో కరీంనగర్ డిఫెన్స్ అకాడమీ అని పేరుపెట్టి ఆర్మీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పనులు ప్రారంభించారు , రిపోర్టర్ టివి కధనాల ద్వారా అప్రమత్తమైన కరీంనగర్ ఏబీవీపీ విభాగ్ సంఘటన మంత్రి సత్యనారాయణ , అనిల్ రెడ్డి కలిసి తెలంగాణ నిరుద్యోగ యువత మోసపోకూడదని గత నాలుగైదు రోజులుగుగా కస్టపడి వాస్తవాలను సేకరించి… నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ఘటనను వెలుగులోకి తెచ్చారు .
ఏబీవీపీ నాయకులు కరీంనగర్ పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఎందరో బాధితులు స్పందించినట్టు సమాచారం .
ఎబివిపి నాయకులు మాట్లాడుతూ యువతను ఆర్మీ ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న బివి రమణ , రవి రాజు లాంటి వారిని నమ్మవద్దని , వీరు మరెక్కడైనా సరే ఆర్మీ , నేవీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కనబడితే స్థానిక అధికారులు స్పందించి తగు చెర్యలు తీసుకోవాలని కోరారు .