జగిత్యాల జిల్లా మెట్ పల్లి : జగ్గాసాగర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏనుగు ప్రతాప్ రెడ్డి ఉద్యోగ నిమిత్తం దుబాయ్ లో ఉంటున్నాడు. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉండడంతో కళ్ళతో చుసిన కొడుకు ప్రభాస్ (19 ) తల్లిని మందలించి, మనస్తాపంతో పురుగుల మందు తాగడంతో ఆసుపత్రికి తరలించగా మూడు రోజుల తరువాత చనిపోయాడు.
కుమారుడి మరణ వార్తా విన్న తండ్రి స్వంత గ్రామానికి చేరుకున్నాడు. మీడియాతో మాట్లాడుతూ నా భార్య వేరొకరితో అక్రమసంబంధం పెట్టుకొని తన బిడ్డకి పురుగుల మందు ఇచ్చి చంపారని ఆరోపిస్తున్నాడు. తన బిడ్డకి ఆత్మశాంతి కలగాలంటే వారిని కఠినంగా శిక్షించాలని కోరాడు
ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీస్ వారు మాత్రం తల్లి మందలించినందుకు తన కుమారుడు పురుగుల మందు తాగాడని చెప్తున్నారు. ఈ కేసులో కీలకమైన విషయమేమిటంటే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి బిఆర్ఎస్ నాయకుడని అందుకే కేసుని నీరుగారుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.