రాజన్న సిరిసిల్ల జిల్లా: రానున్న బతుకమ్మ, దసరా పండగ ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో రైతు వేదిక ఆవరణలో వేములవాడ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా విప్ మాట్లాడారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడం వలన గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుందని రానున్న దసరా బతకమ్మ దీపావళి పండగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా గ్రామాల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు, ఇన్చార్జిలు ప్రభుత్వం తరఫున చూడాలని పేర్కొన్నారు.. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేటి నుంచే వాటిని పరిష్కరిస్తూ పండగ నాటికి సరియైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారులు, ప్రజలు చెప్పేది వింటూ ముందుకు పోతుందని పేర్కొన్నారు..గ్రామాల్లో ప్రధాన కూడళ్లను సుందరంగా చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు.
గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలి
గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, ఇన్చార్జిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆయా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రతి వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేల చూడాలని పేర్కొన్నారు.. ప్రభుత్వం అందించే సూచనలను సలహాలు పాటిస్తూ ముందుకు పోవాలన్నారు.. ఇంటి నిర్మాణ పర్మిషన్ విషయంలో అధికారులు జాప్యం చేయకుండా అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు.. అనుమతుల మంజూరు విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తే పై అధికారులను సంప్రదించాలన్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లతో, గ్రామ కార్యదర్శులతో గ్రామాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు.. వారు చేపడుతున్న పనులు, శానిటేషన్, విద్యుత్ దీపాలు, ఇంటి నిర్మాణ పర్మిషన్ లు,పెండింగ్ పనుల వివరాలపై ఆరా తీశారు. ప్రతీ రోజూ గ్రామాల్లో శానిటేషన్ పనులు నిర్వహించాలని, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండేలా చూడాలని పేర్కోన్నారు.. వీధిలైట్లు వెలిగేలా చూడాలని పేర్కొన్నారు.. ప్రతీ గ్రామాల్లో పంచాయితీ కార్యదర్శులు పేర్లు, ఫోన్ నెంబర్ లు తో సూచిక బోర్డు లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించాలని పేర్కొన్నారు.. పంచాయితీ రాజ్ వ్యవస్థ లో ఉన్నా విదులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. రానున్న బతుకమ్మ దసరా పండగ నాటికి గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంచార్జీ డీపీఓ శేషాద్రి, డీఎల్పీఓ గీత, ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.