కరీంనగర్ పట్టణంలోని సోమవారం గాల్వాన్ లోయలో జరిగిన చైనా దేశపు సైనికులతో జరిగిన వీరోచిత పోరాటం లో అసువులు బాసిన భారత మాత ముద్దుబిడ్డ సంతోష్ బాబు ఆత్మకుశాంతి చేకూరాలని భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు చైనా దేశాన్ని ఆర్థికంగా అక్కడి వస్తువులను కొని మనమే బలోపేతం చేస్తున్నాం కాబట్టి ఈరోజు నుండి మనం అందరం చైనా వస్తువులను బహిష్కరిద్దాం అంటూ బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుగంటి సుజాత రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు హరికుమార్ గౌడ్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్ రెడ్డి మహిళా మోర్చా నాయకురాలు పోతుగంటి శారద,మున్నా, పెరంబదూర్ రమా, శైలజ, కల్పన,బీజేవైఎం నాయకులు రాజేష్, శ్రీనాథ్ రెడ్డి, బండ నరసింహారెడ్డి, శ్రవణ్, మహిత్ తదితరులు పాల్గొన్నారు