- వచ్చే ఏడాది నుంచి గురుకుల డిగ్రీ కాలేజీలు
ప్రకాశం జిల్లాకొండేపి నియోజకవర్గం సింగరాయకొండ లోని అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలనుగురువారం నాడు APSWRIES కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. ఐ.ఐ.టీ – నీట్ శిక్షణ, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల పరి పరిశీలిoచారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచే సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఐఐటి, నీట్ కోచింగ్ ,వచ్చే ఏడాది నుంచి గురుకులాల్లో డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో మొట్టమొదటిగా సింగరాయకొండలో గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు.
మంత్రి, జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా మాట్లాడుతూ .. గురుకులాల్లో విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందిస్తూ బోధనలు ఉంటాయని,చదువు అయిపోయి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి ఏదో ఒక నైపుణ్యంతో బయటికి వెళ్లాలని,విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఎంబీబీఎస్ మొదటి విడత కౌన్సిలింగ్ లో మెడికల్ సీట్లు సాధించిన వివిధ గురుకులాల్లోని 40 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ,మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారులు,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.