- అవకాశాల పేరుతో యువతికి లైంగిక వేధింపులు
జగిత్యాల జిల్లాలో మరో జానీ మాస్టర్ తయారయ్యాడు .. లేడీ సింగర్ ను కొంత కాలంగా బెదిరింపులు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో హిట్ సాంగ్స్ ని రచించి మంచి పేరు తెచ్చుకున్నారు. తన రచనల ద్వారా లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ జిగిత్యాల లోని మామిడి మౌనిక అనే యువతికి సింగర్ గా అవకాశం ఇచ్చాడు. వీరి కాంబోలో వచ్చిన ఎన్నో ఫోక్స్ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. దుబాయ్ వంటి ఇతర దేశాల్లో ఎన్నో ఈవెంట్స్ నిర్వహించారు. ఇదిలా ఉంటే.. సుద్దాల మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు చేశారు జగిత్యాల పోలీసులు.
అవకాశాలు ఇప్పిస్తానని లైంగిగ వేధింపులకు గురి చేశాడని మల్లిక్ తేజ్ పై సింగర్ మామిడి మౌనిక ఫిర్యాదు చేసింది. తన యూట్యూబ్ఛానల్ ఇంస్టాగ్రామ్ ఐడీలు పాస్ వర్డ్స్ లు మార్చి, తనపై బెదిరింపులకు పాల్పపడుతూ మానసికంగా వేధిస్తున్నాడని జగిత్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు స్టూడియలో తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది మౌనిక. తరుచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా దుర్బాషలాడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మల్లిక్ తేజ్ పై కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.