contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యెమెన్‌లో హౌతీలపై ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్, ఇటీవల హమాస్ మరియు హిజ్బుల్లా పై జరిపిన దాడుల తర్వాత, యెమెన్‌లో హౌతీ మిలిటెంట్లపై ఆకస్మిక దాడులు జరిపింది. ఆదివారం, ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) భారీ వైమానిక దాడులు జరిపి, దాని లక్ష్యంగా హౌతీ మిలిటెంట్లతో పాటు ప్రధానమైన మౌలిక సదుపాయాలను నాశనం చేసింది.

హోడెయిడా పోర్ట్‌పై దాడి చేసి, అక్కడి పవర్ ప్లాంట్లు, నౌకాశ్రయాలు మరియు అనేక ఇతర నిర్మాణాలను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ ..   మా సందేశం చాలా స్పష్టంగా ఉంది. మా భద్రతా బలగాలకు ఏ ప్రదేశమూ అంత ఎక్కువ దూరంలో లేదు అని పేర్కొన్నారు.

కాగా దాడి జరిపిన హుడెయిడా పోర్టు హౌతీ మిలిటెంట్లకు చాలా ముఖ్యమైనది. చమురు దిగుమతి కోసం ఈ నౌకాశ్రయాన్ని ఉపయోగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఉండడంతో ఈ పోర్ట్ ద్వారానే ఇరాన్ ఆయుధాలను ఈ ప్రాంతానికి చేరవేస్తున్నారు. చమురు రవాణాతో పాటు సైనిక అవసరాల కోసం దీనినే ఉపయోగిస్తున్నారని, అందుకే దాడి చేసినట్టు ప్రకటనలో ఐడీఎఫ్ పేర్కొంది.

ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు చనిపోయారని, 29 మంది గాయపడ్డారని హౌతీ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న ఈ మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ దళాలు దూకుడుగా వైమానిక దాడులను చేస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా యెమెన్‌లోని లక్ష్యాలపై గురిపెట్టాయి. గత రెండు రోజులుగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపుతోంది. దాని చీఫ్ హసన్ నస్రల్లాను కూడా అంతమొందించిన విషయం తెలిసిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :