మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని సహకార సంఘంలో 1,076 రైతులకు రుణమాఫీ చేసినట్లు సహకార సంఘం అధ్యక్షుడు తిరుమల అనంతరెడ్డి తెలిపారు. ఈ రుణమాఫీకి సంబంధించి మొత్తం 4 కోట్ల 60 లక్షల రూపాయల మొత్తం రుణమాఫీ జరిగిందని ఆయన వివరించారు.
అంతేకాక, వడ్డీ కలుపుకొని రైతులకు 6 కోట్ల రూపాయల కొత్త రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాభాల బాటలో నడుస్తున్న ఈ సంఘం, ఈ సంవత్సరం 94 లక్షల రూపాయల లాభం పొందింది. గతంలో 3 కోట్ల 90 లక్షల నష్టాలలో నడిచిన ఈ సంఘం, ఇప్పుడు లాభాలు సాధించటానికి కృషి చేస్తోంది.
2023-24 సంవత్సరానికి 2 కోట్ల 6 లక్షల లాభంతో, కమర్షియల్ బ్యాంకుల కన్నా లాభాలను పొందుతున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో C క్లాస్ నుండి A క్లాస్ వరకు వెల్దుర్తి సహకార సంఘం అభివృద్ధి చెందింది.
సహకార సంఘంలో 4,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు, అందులో 1,700 మంది రుణాలు పొందారు. ప్రభుత్వ రుణమాఫీగా 1,076 మంది రైతులకు మద్దతు అందించామని, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ వంటి సాంకేతిక లోపాలున్న 150 మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తించనున్నట్లు తెలిపారు.
200 మంది రైతులు రెండు లక్షల పైగా రుణాలున్నారని, వారికి కూడా త్వరలో రుణమాఫీ అందుబాటులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనంతరెడ్డి, డైరెక్టర్లు కిష్టా గౌడ్, ఉదండాపురం నర్సింలు, కాసాల పోతిరెడ్డి, నరసింహారెడ్డి, రాపర్తి అమృత, అశోక్ రెడ్డి, సహకార సంఘం సిబ్బంది సీఈఓ సిద్దయ్య పాల్గొన్నారు.