సంగారెడ్డి / రామచంద్రాపురం: విద్యార్థుల విద్యా వికాసానికి తోడ్పడేందుకు క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం, రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో, మన ఊరు మన బడి పథకంకు ఆధారంగా ఒక కోటి 23 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో, పాఠశాల నిర్మాణానికి జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సిఎస్ఆర్ ద్వారా 40 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ, “కార్పోరేట్ పాఠశాలలకు డీటుగా నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామని” తెలిపారు.
“పటాన్చెరులో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ భవనాల్లో విద్య రంగాన్ని అభివృద్ధి చేశాం. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు, తద్వారా మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాం” అని చెప్పారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, “ప్రతి పాఠశాలలో బాలికలకు స్వీయ రక్షణపై శిక్షణ అందించాలని” కోరారు. స్వామి వివేకానంద ఇచ్చిన సూచనకు అనుగుణంగా, “తరగతి గది నాలుగు గోడల మధ్య మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని” ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, పంచాయతీరాజ్ డి ఈ సురేష్, మండల విద్యాధికారి రాథోడ్, మరియు ఇతర సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు