contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Jogulamba: ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు

జోగులాంబ : వృద్ధుల పట్ల గౌరవంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవి అన్నారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ అందరంలో నిర్వహించిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి & సినియర్ సివిల్ జడ్జి శ్రీమతి గంటా కవితా దేవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వయోవృద్ధుల విజ్ఞానం వారి అనుభము నేటి తరానికి మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. ఎలాంటి ఒత్తిడికు లోనూ కాకుండా కుటుంబ సభ్యలతో ఆనందంగా గడపాలని, ఎదైన సమస్య ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఎల్లవేళల తోడుగా ఉంటుందని అన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తే వారి పోషణ నిమిత్తం జిల్లాలోని ఆర్డిఓ లేదా జిల్లా సంక్షేమ శాఖ అధికారి, తహసీల్దార్ కార్యాలయంలో వారిపై దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లేదా నేరుగా కోర్టుకు దరఖాస్తు చేసుకుంటే వారి పట్ల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ, అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు వయవృద్ధులతో అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినదని తెలిపారు. ఇందులో భాగంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, నేటి రోజుల్లో చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల మానవతా విలువలు తగ్గిపోయాయని తెలిపారు. గతంలో ఉమ్మడి కుటుంబాల వలన మంచి చెడులు చెప్పేవారు ఉండేవారని, నేటి సమాజంలో చిన్న కుటుంబాలుగా విడిపోయినందున వారికి మంచి చెడు చెప్పే పెద్దవారు లేకపోయారన్నారు. పిల్లలందరికీ పెద్దలను గౌరవించడం మరియు మానవతా విలువలను పెంపొందించుకోవాలని అన్నారు.

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నేటి యువత వృద్ధులు, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలని వారిని చిన్నచూపు చూడకూడదని, వారిపట్ల నిర్లక్ష్య ధోరణి చూపరాదని వారిని ప్రేమ ఆప్యాయతతో చూసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు. వృద్ధుల అనుభవాలు వారి జ్ఞానం నవ సమాజానికి మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. భారతదేశంలో సంస్కృతీ సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారనీ, కొన్ని కారణాల వల్ల కుటుంబాలు దూరం అయిపోతున్నాయని, మానవతా విలువలు తగ్గుపోతున్నాయని, ఇలాంటి తరుణంలో పెద్దలని గౌరవించి ప్రేమను పంచాలని కోరారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన సీనియర్ సిటిజన్స్ కు మేమెంటోలు, శాలువలతో సన్మానం చేయడం జరిగింది.

కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్‌, ఇంచార్జి డీడబ్ల్యూవో సుజాత, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ వినోద్‌, సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం సభ్యులు బాలకిషన్‌, అచ్చన్నగౌడ్‌, రామలింగయ్య, సాయిబాబా, సుధాకర్‌, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :