మెదక్ జిల్లా: తూప్రాన్ డివిజన్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ వేడుకలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని గాంధీ ఆశయాలను గుర్తు చేసుకున్నారు. జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ, “మహాత్మా గాంధీ తత్వాలు మన సమాజానికి ప్రేరణగా నిలుస్తాయి. ఆయన అందించిన సందేశాలను మనం కొనసాగించాలి” అని అన్నారు.