- గాంధీజీ సేవలు మరువలేనివి తాసిల్దార్ జ్ఞాన జ్యోతి
మాసాయిపేట మండలం కేంద్రంలో, మాసాయిపేట మండల కార్యాలయంలో తాసిల్దార్ జ్ఞాన జ్యోతి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా, గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఆయన సేవలను కొనియాడారు.
తాసిల్దార్ జ్ఞాన జ్యోతి మాట్లాడుతూ, “గాంధీజీ చేసిన సేవలు మరిచిపోలేనివి. ఆయన ఆలోచనలు, కృషి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి” అని చెప్పారు. అనంతరం, మాసాయి పేటలో గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరగడమే కాకుండా, మండలవ్యాప్తంగా చుట్టుపక్కల గ్రామాలలో కూడా వేడుకలు నిర్వహించబడ్డాయి.
చెట్ల తిమ్మాయిపల్లి, పోతనపల్లి, నడిమి తండా, వెనుక తండా, కొప్పులపల్లి, బొమ్మారం, నాసాన్పల్లి, స్టేషన్ మాసాయిపేట గ్రామాలలో గాంధీజీ జయంతి వేడుకలను పూలమాలలు వేసి ఘనంగా జరుపించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, యువజన సంఘాలు మరియు కార్మిక సంఘాలు పాల్గొన్నారు. గాంధీజీ యొక్క సందేశాలను ప్రస్తావిస్తూ, సమాజంలో ఏకత్వం, శాంతి మరియు సామరస్యాన్ని ప్రతిపాదించారు.