కరీంనగర్ జిల్లా: జాతిపిత మహాత్మ గాంధీ జయంతి వేడుకలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము లో బుధవారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పరిపాలన భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మినారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ సత్యం, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం సాధించుటలో కీలక పాత్ర పోషించిన ఘనుడన్నారు. అనేక దేశాలు ఆయన మార్గాలను నేటికీ అనుసరిస్తునయన్నారు. మనం కూడా మహాత్మ గాంధీ ఆశయాలను పాటిస్తూ ముందుతరాలకు తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ (సీ.సీ.ఆర్.బి.) విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ రిజర్వు ఇన్స్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి(సంక్షేమం) లతో పాటు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది వున్నారు.