- హాజరై అభినందనలు తెలిపిన జిల్లా ఎంపీలు,మంత్రులు,ఎమ్మెల్యేలు, నాయకులు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల 24వ తేదీన రాష్ట్రంలోని కీలకమైన నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న నూకసాని బాలాజీకి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, కొండేపి నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న దామచర్ల సత్యనారాయణ (సత్య) కు మారి టైం బోర్డు చైర్మన్ గా నియమించారు.
శనివారం నాడు విజయవాడ ఆటోనగర్ లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ గా డా. నూకసాని బాలాజీ పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్ దామచర్ల సత్య అధికారంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారికి పార్టీ ఎల్లప్పుడు తోడుగా ఉంటుందని, పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ శ్రమకు తగిన గౌరవాన్ని ఇచ్చారని ఇరువురు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాసత్యప్రసాద్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్, గిద్దలూరు శాసనసభ్యులు ముక్తమాల అశోక్ రెడ్డి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు,బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు తదితరులు పాల్గొని ఇరువురికి అభినందనలు తెలియజేశారు. ఇంకా వారితోపాటు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.