కరీంనగర్ జిల్లా: ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్ (క్యాంపు కార్యాలయం) తిమ్మాపూర్ మండలానికి చెందిన 81 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 21.90 లక్షల రూపాయల విలుగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్ఙంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వ హాస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతోపాటు మండలాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లోనూ మందులు అందుబాటులో ఉంచుతోందన్నారు. నిరుపేదలు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు వైద్య కోసం వెచ్చించిన మొత్తంలో కొంత సాయంగా అందించడం ద్వారా వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నిరుపేదలు సమర్పించిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆ కారణంగానే త్వరితగతిన సీఎంఆర్ఎప్ చెక్కులు మంజూరవుతున్నా యని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వివరించారు. పెండింగ్ బిల్లలు మంజూరు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు ఎల్కపెల్లి సంపత్, సముద్రాల లక్ష్మణ్, పొలు రాము, పోలు రమేశ్, రెడ్డిగాని రాజు,బండారి రమేష్, ఎలుక రాజు, ఎలుక శ్రీధర్,చింతల లక్ష్మారెడ్డి, బుదారపు శ్రీనివాస్, జొన్నగడ్డల లింగయ్య, నగునూరి శ్రినివాస్,మార్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామంలో గల మానకొండూర్ ప్రజాభవన్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 81మంది లబ్ధిదారులకు రూ.21 లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.