contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డా.బి.ఎన్. రాజుకు డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డ్

పిఠాపురం : కాకినాడ పట్టణంలో వున్న సత్కలవాహీనీలో నిత్యం ప్రజలకు అన్న దానం చేసిన అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ 183వ జయంతి వేడుకలు వర్ణ ధార హెల్త్ ఆర్గనైజేషన్ (వి.హెచ్.ఓ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణానికి చెందిన దళిత సమాజ్ సేవా సంస్థ అధ్యక్షుడు మరియు జనసేన నాయకుడు డా.బొండాడ నూకరాజు (బి.ఎన్.రాజు)కు డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డ్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సేవలను గుర్తించిన ఈ వర్ణ ధార హెల్త్ ఆర్గనైజేషన్ (వి.హెచ్.ఓ) సంస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అన్నారు. అలాగే ఈ అవార్డు ద్వారా తనకు మరింత బాధ్యత అప్పగించారన్నారు. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డ్ సంస్థ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :