అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని, తహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ఈ పంట నమోదు ప్రక్రియను నాణ్యతగా చేపట్టేలా మానిటర్ చేయాలన్నారు. ఫ్రీ హోల్డ్ అయిన భూముల పునః పరిశీలన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయా కార్యాలయాల ద్వారా ప్రజలకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆయా కార్యాలయాల్లో రికార్డులను చక్కగా మెయింటైన్ చేయాలన్నారు. అన్ని కార్యాలయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఉద్యోగులు అందరూ నిర్ణీత సమయంలో కార్యాలయానికి హాజరు కావాలన్నారు. భూమి సమస్యలు మరియు రెవెన్యూ సేవల మీద ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని నిర్ణయించిన సమయంలో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అంతకుముందు గుంతకల్లు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, తదితరులు పాల్గొన్నారు.