హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చోటు చేసుకున్న పేలుడు ఘటనలో వారు కన్నుమూశారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇండియన్ ఫీల్డ్ గన్‌లోని షెల్ పేలింది. దీంతో వారు తీవ్ర గాయాలతో మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.
నాసిక్‌లోని అర్టిలరీ కేంద్రంలో ఇండియన్ ఫీల్డ్ గన్‌తో కొంతమంది అగ్నివీరులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక షెల్ పేలింది. దీంతో హైదరాబాద్ అర్టిలరీ కేంద్రానికి చెందిన విశ్వరాజ్ సింగ్, సైఫత్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.