సంగారెడ్డి జిల్లా ,అమీన్‌పూర్ : దసరా పండుగను పురస్కరించుకొని, అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో అమీన్పూర్ చెరువు కట్టపై ప్రత్యేకంగా దసరా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడాయి. ఈ కార్యక్రమం ప్రారంభంలో, అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జెండా ఎగరవేసి, జమ్మి చెట్టుకు పూజలు చేయడం జరిగింది.
తెలంగాణ కళాకారుడు బిత్తిరిసత్తి, ప్రముఖ గాయని మంగిలి, ఇంద్రావతి,నిర్వహించిన పలు కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.
ఈ సందర్భంగా, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ, “చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించందమే విజయదశమి వేడుకలన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు , ప్రజలు పాల్గొన్నారు.