ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంతో, మద్యం దుకాణాల వద్ద మందుబాబుల తాకిడి బాగా పెరిగింది.
గత మూడ్రోజుల్లో రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మూడ్రోజుల్లోనే 7,943 మంది వ్యాపారులు స్టాక్ తీసుకెళ్లారు. ఈ మూడ్రోజుల్లోనే రెండు, మూడు సార్లు స్టాక్ తీసుకెళ్లిన వ్యాపారులు కూడా ఉన్నారంటే… దుకాణాల్లో మద్యం సీసాలు ఎంత వేగంగా అమ్ముడవుతున్నాయో అర్థమవుతోంది.
నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,77,511 కేసుల లిక్కర్ అమ్ముడైంది. 1,94,261 కేసుల బీర్లు అమ్మడయ్యాయి. రాష్ట్రంలోని బార్లకు ఈ మూడ్రోజుల్లో ఎక్సైజ్ శాఖ రూ.77 కోట్ల విలువైన అమ్మకాలు జరిపింది.