పల్నాడు జిల్లా, కారంపూడి : ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మీసేవ కేంద్రాన్ని మండల కేంద్రమైన కారంపూడి లో నిర్వహించడంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు పంగులూరి.అంజయ్య, చప్పిడి రాము, గోరంట్ల నాగేశ్వరావు శెట్టి శంకర్ లు కలిసి కారంపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఒప్పిచర్ల మీ సేవ కేంద్రానికి సంబంధించి మంగళవారం తాహసిల్దార్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు తాహసిల్దార్ తో మాట్లాడుతూ ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మీసేవ కేంద్రాన్ని ఒప్పిచర్ల గ్రామంలో ఏర్పాటు చేయించాలని ఆయనకు విన్నవించుకున్నారు. ఆ గ్రామానికి చెందిన మీ సేవ కేంద్రాన్ని కారంపూడి లో నిర్వహించడంతో ఒప్పిచర్ల గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. ఒప్పిచర్ల మీసేవ కేంద్రాన్ని తీసుకొచ్చి కారంపూడి పట్టణంలో నిర్వహిస్తూ మండల ప్రజల వద్ద మండలంలో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అతనిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని టిడిపి నేతలు అన్నారు. మండలంలోని ప్రజలకు మాయమాటలు చెప్పి తాహసిల్దార్ కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనేక ఆరోపణలు ఉన్న వైసీపీ ప్రభుత్వం అండదండలతో పట్టణంలో మీ సేవ నిర్వహిస్తూ తను ఇష్టం వచ్చినట్లు చలామణి చేశారని టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మీ సేవ కేంద్రాన్ని ఆ గ్రామంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు