పల్నాడు జిల్లా, నరసారావు పేట : పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.స్థానిక పార్టీ కార్యాల యంలో నియోజకవర్గానికి చెందిన 12 మంది బాధితులకు 10.65 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 108,104 వాహనాలను మరింత అధునాతన పరికరాలతో రూపొందిస్తామన్నారు.ఈ వాహనాల ద్వారా ప్రాణనష్టం జరుగకుండా చికిత్సలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నేతలు పాల్గొన్నారు.