కరీంనగర్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా పేదలకు ఆర్థికంగా చేయూతనందిస్తోందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని, దీన్ని ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలోని 17 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4.51 లక్షలు రూపాయలు మంజూరైనట్టు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో గన్నేరువరం తహశీల్దార్ ఇప్ప నరేందర్, వ్యవసాయ అధికారి కిర్మణయి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బెజ్జంకి మండల పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్, గన్నేరువరం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పర్తి పరిపూర్ణ చారి. తదితరులు పాల్గొన్నారు.