పిఠాపురం : పిఠాపురం భాష్యం పాఠశాలలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ వివిధ వేషధారణలతో కృష్ణుడు మరియు సత్యభామ వేషధారణలో పిల్లలు అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ పాలుపర్తి వేణు మాట్లాడుతూ భారతీయ పండుగల యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఈ పండుగ నిర్వహించామని అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ దివాళి యొక్క ఉద్దేశాన్ని విద్యార్థులకు బలంగా తెలియజేయాలని ఉద్దేశంతో గ్రీన్ దివాళి మరియు ఎకో దీపావళి అని నినాదాలు చేయించారు. పాఠశాల ప్రైమరీ హెచ్ఎం అరుణ మాట్లాడుతూ భారతీయ సంప్రదాయం పట్ల విద్యార్థులకు ఎక్కువ అవగాహన కలిగే ఉద్దేశంతో పండగ నిర్వహించామని తెలియజేశారు. పాఠశాల ఆవరణ అంతా దీపాలతో అలంకరించి విద్యార్థులచే దీపావళి సామాన్లు కల్పించి ఉత్తేజపరిచారు. విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మరియు జోనల్ ఇంచార్జ్ గోవిందరాజు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వేణు, హెచ్ఎం అరుణ మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు