గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్-లోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్, జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్)లు బుధవారం సంయుక్తంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని’ ఉత్సాహభరితంగా నిర్వహించాయి. భారతదేశ ఏకీకరణ కోసం పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గీతం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు ఘననివాళులు అర్పించి, జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్జ చేశారు.
ఐక్యతా స్ఫూర్తికి అనుగుణంగా, విద్యార్థులు తమ సమష్టి బలాన్ని, సంఘటిత సమాజాన్ని పెంపొందించే అంకితభావానికి ప్రతీకగా ‘ఐక్యతా నడక’లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నడక సంఘీభావం, పరస్పర గౌరవం ప్రాముఖ్యతను చాటిచెప్పింది.
జాతీయ ఐక్యతపై దృష్టి సారించడంతో పాటు, శారీరక దృఢత్వం ప్రాముఖ్యతను కూడా గీతం నొక్కి చెప్పింది. జాతీయ సమగ్రత, వ్యక్తిగత శ్రేయస్సు కోసం, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విద్యార్థులు ప్రేరణ పొందారు.
ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.