కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీలో ఉన్న రైల్వే శాఖకు చెందిన ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ గోదాంలో నిల్వ ఉంచిన సుమారు నాలుగున్నర లక్షల విలువ చేసే కాపర్ వైర్ ను నవంబర్ 29వ తేదీన గోదాం సెట్టర్ తాళాలు పగల కొట్టి కాపర్ సుమారు 500 కేజీల వైరును దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను జమ్మికుంట పోలీసులు చాకచక్యంగా 48 గంటల్లో పట్టుకోవడం జరిగిందని సిఐ వీ రవి తెలిపారు. బండావతి సందీప్ అనే వ్యక్తి మరో వ్యక్తి బాలుతో కలిసి నవంబర్ 29న సుమారు 5 లక్షల విలువచేసే కాపరువైరును దొంగతనం చేసి కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన హేమ కనకయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలిసింది. దొంగతనం జరిగినట్లు గోడౌన్ ఇంచార్జ్ జగదీష్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను చాకచక్యంగా పట్టుకొని కేసును చేదించిన జమ్మికుంట పట్టణ ఎస్ఐ ఆరోగ్యం, హెడ్ కానిస్టేబుల్ నెల్లి మోహన్, సదయ్య, సంపత్ లతోపాటు కానిస్టేబుల్ వేణు మిగతా సిబ్బందిని సిఐ అభినందించారు