ధాన్యం కొనుగోలులో అకాల వర్షాల నుంచి రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఒక్కో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక్కో రకమైన దోపిడీ జరుగుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ అన్నారు శనివారం గన్నేరువరం మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బిజెపి జిల్లా నాయకులు పుల్లెల పవన్ కుమార్ తో కలిసి బాస సత్యనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా బాస సత్యనారాయణ మాట్లాడుతూ రైతుకు సంబంధించి ఎటువంటి పాలసీ లేని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు తాలు, తేమ, మిల్లర్లు, కటింగుల పేరుతో రైతులను దోచుకుంటున్నారన్నారు , ప్రతి సెంటర్ లో నలభై రెండు కిలోల చొప్పున తూకం వేస్తున్నారని తూకం వేసిన రైతులకు బిల్లు రసీదు ఇవ్వడం లేదన్నారు ఈ బస్తాలు మిల్లర్లకు వెళ్ళిన తర్వాత మరల ఒక బస్తా 42 కు తాలు పేరుతో మరలా ఐదు కిలోలు కటింగ్ చేసిన సంఘటన గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన రైతు బొజ్జ ఎల్లయ్య తండ్రి లచ్చయ్య, యాలాల రామకృష్ణ అనే రైతులకు ఎక్కువగా కటింగ్ చేస్తున్నారని తెలిపారు అనంతరం గన్నేరువరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో కె రమేష్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు జాలి శ్రీనివాస్ రెడ్డి, జంగపల్లి ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, నాయకులు గడ్డం సుమిత్ రెడ్డి, పురుషోత్తం శీను, బజారు బాలయ్య, తదితరులు పాల్గొన్నారు