- దీపం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్
పిఠాపురం : దీపావళి రోజు ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపే విధంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దీపం 2.0 పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంచార్జ్ ఎస్విఎస్ఎన్.వర్మ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి (బాబు) తెలిపారు. పిఠాపురం పట్టణం వెంకట సత్య ఏజెన్సీ హెచ్.పి గ్యాస్ నందు దీపావళి కానుకగా మహిళలు సేవలో దీపం 2 పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దీపం 2.0 పథకంలో ఇబ్బందులు ఉంటే 1967కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎంతగానో కృషి చేయడం జరుగుతుందన్నారు. సూపర్ సిక్స్ మ్యానిఫెస్టోలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని చేర్చి అమలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీయే కూటమి పక్షాల మద్దతుతోనే దీపావళి సందర్భంగా దీపం 2.0 పథకం కార్యరూపం దాల్చుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్.కనకారావు, ఎమ్మార్వో, ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి, జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు, సూరవరపు సురేష్, పిల్లా శివ, వార్డు కౌన్సిలర్లు, శ్రీ వెంకట సత్య ఏజన్సి సి.హెచ్.రవిప్రసాద్, శ్రీనివాస హెచ్పి గ్యాస్ ఏజన్సీ పి.శ్రీనివాస్ బాబా, వి.జె.రత్నం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వి.విద్య ప్రియదర్శని, శ్రీ విశ్వనాధ సత్యసాయి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గొల్లప్రోలు సత్యనారాయణమూర్తి, గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, అధిక సంఖ్యలో లబ్ధిదారులు, జనసేన నాయకులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.