కరీంనగర్ జిల్లా: కన్నతల్లిని వదిలి వెళ్లిన కసాయి కొడుకు సాయిని బాలవ్వ గురించి రెండు రోజుల క్రితం “ది రిపోర్టర్” టీవీలో ప్రసారమైన కథనం పట్ల గన్నేరువరం రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ కథనం ప్రసారమైన తరువాత, ఎమ్మార్వో నరేందర్ బాలవ్వతో మాట్లాడి కొడుకును పిలిపించాడు.
ఈ నేపథ్యంలో, శనివారం, బాలవ్వ కుమారుడు సాయిని చిన్న మల్లేశం మరియు కోడలు మధులతలను ఖాసీంపేట గ్రామానికి పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎమ్మార్వో విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా, చిన్న మల్లేశం పేరు మీద ఉన్న ఐదు ఎకరాల భూమిని బాలవ్వ పేరుమీదకి మార్పిడి చేస్తామని ఎమ్మార్వో తెలిపారు. “ది రిపోర్టర్” టీవీ కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారుల చర్యలకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.