కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పట్టణం నుండి గుండ్లుపల్లి వయా జంగపల్లి,మాదాపూర్ మీదిగా గన్నేరువరం, చొక్కారావుపల్లె కి మాదాపూర్ గ్రామ ప్రజలు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్టీసీ బస్సు కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించి. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలు చిరకాలం కోరిక నెరవేర్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృషితో మండల ప్రజలకు చిరకాల కోరిక నెరవేరిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.