అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జడ్ వీరారెడ్డి భవనంలో సిపిఎం పార్టీ పదవ మండల మహాసభ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సావిత్రమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మండల కమిటీ ఏర్పాటులో భాగంగా మండల కార్యదర్శిగా వి నిర్మల ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గుత్తి మండల కార్యదర్శి మాట్లాడుతూ భవిష్యత్తులో నిత్యావసర సరుకుల అధిక ధరలపైన మద్యం ధరలు నియంత్రణపై విద్య వైద్య ప్రజలకు అందుబాటుపై రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ పథకాల అమలపై మున్సిపాలిటీలోని తాగునీరు డ్రైనేజీ వ్యవస్థలపై పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ రేణుక మల్లికార్జున రమేషు మల్లేష్ రంజిత్ నాయక్ కామేశ్వరి మద్దిలేటి రేవతి తదితరులు పాల్గొన్నారు.