కరీంనగర్ జిల్లా: కరీంనగర్ డిపో మేనేజర్ కి రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ నుంచి వెంకట్రావుపల్లి మీదుగా పొత్తూరు – గన్నేరువరం మైలారం,ఖాసీంపేట,పారువెళ్ల, గ్రామాల మీదుగా ప్రతిరోజు సాయంత్రం 5:30 ని. మరియు రాత్రి 8:30 ని. బస్సు సర్వీస్ సౌకర్యం ఉండేది ఇట్టి సర్వీస్ గత రెండు రోజుల నుండి బందు చేయడం వల్ల ఉదయం రాత్రి పూట ఈ బస్సు నుండి జిల్లాలకు ప్రయాణం చేసే విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని, వీరందరి బాధను దృష్ట్యా తమ బాధను పరిగణంలోకి తీసుకొని ఇట్టి సర్వీసును పునర్దించాలని కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.