తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థులపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు మొహిద్దిన్ బాషా మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువులపై శ్రద్ధ చూపాలన్నారు. బోధన, పరీక్షల గురించి వివరించారు. అదేవిధంగా బాలికల జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు బేబీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు ఇంటికి రాగానే ఇవాళ పాఠాలు ఏమి జరిగాయి? ఏమి చదువుతున్నారని తల్లిదండ్రులు అడగాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ హాజరు, పరీక్షల్లో సాధించిన మార్కుల గురించి అధ్యాపకులు తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.విరమేశ్ కుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ ఈశ్వర్ బాబు, అధ్యాపకులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.