జగిత్యాల జిల్లా – మెట్ పల్లి పట్టణం అంబేద్కర్ నగర్ లోని ఓ ఇంట్లో నిన్న రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు. ఇంట్లో పెట్టిన దీపాల వలన అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే దాదాపు 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.