బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభత్వం ఏర్పడిన దగ్గరనుండి లేదా 2017 నుండి ఎపి మరియు తెలంగాణ ప్రభుత్వాలకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అస్సోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ పలు సూచనలు, హెచ్చెరికలు చేసారు. అదే విధంగా ఎపి లో కూటమి ప్రభత్వం ఏర్పడినదగ్గర నుండి “X ” వేదిగకగా ఎపి ప్రభత్వానికి పలు సూచనలు చేసారు. ఆయన ఇచ్చినటువంటి సూచనల పై ఎపి ప్రభత్వం నేడు స్పందించింది.
ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనేకమైన కీలక అంశాలపై సియం చంద్రబాబు చర్చిండడం జరిగింది అందులో భాగంగా సోషల్ మీడియా పోస్టుల పై సీఎం చందరబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చాలామంది మంత్రులకు ఇంకా సీరియస్ నెస్ రాలేదని… కొందరు మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని వార్నింగ్ ఇచ్చారు. మెతక వైఖరి విడనాడాలని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొంతమంది వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ కు అనుకూలంగా పని చేసిన కొందరు పోలీసు అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఉన్నారని చెప్పారు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇళ్లలో ఉన్న మహిళలపై కూడా పోస్టులు పెడుతున్నారని… అందుకే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని చెప్పారు.