contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సామాజిక వేత్త దూసర్లపూడి దీక్ష విరమింపజేసిన జిల్లా కలెక్టర్ సగిలిషాన్ మోహన్

  • 2025-26ఆర్థిక సంఘం నిధులు వచ్చే విధంగా విలీనగ్రామాలతో కాకినాడ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తర్వులు కాపీ అందజేసిన జిల్లా యంత్రాంగం

 

కాకినాడ : మూడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు దీక్షా శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ జిల్లా అధికారులతో సందర్శించి పరామర్శించారు. పబ్లిక్ డిమాండ్ ను గాంధేయ మార్గంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు చేసిన ప్రజాహిత ప్రయత్నాన్ని ముకుళిత హస్తాలతో అభివాదం చేసి అభినందించారు. కాకినాడలో విలీన గ్రామాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సకాలంలో జరిపించి 2025-26 ఆర్థిక సంఘం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు వహించడానికి సంసిద్ధంగా ఉందని సంబధిత 2పేజీల ఉత్తర్వులను నిమ్మరసం అందించి నిరాహార దీక్ష విరమణ చేయించారు. సుమారు 25నిమిషాల పాటు చర్చించారు. ముఖ్య మంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని రాజధాని క్యాంప్ కార్యాలయంలో కలిసేందుకు విలీన గ్రామాల సాధన సమితి ప్రతినిధి బృందానికి ప్రభుత్వ పరంగా అపాయింట్మెంట్ అవకాశం కల్పించాలని పౌర సంఘం నాయకులు కోరిన అంశాన్ని సమ్మతించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ 14 ఏళ్లుగా తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, స్వామినగరం, టీచర్స్ కాలనీ మున్నగు 8 అర్బన్ గ్రామాలు కోర్టు వ్యాజ్యాల కారణంగా ఎన్నికలకు నోచుకోలేదని 2016లో గెజిట్ గవర్నర్ ఆర్డినెన్సు ద్వారా విలీనం కాబడినప్పటికీ, ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ 2017లో రావడం వలన దస్త్రాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 48 డివిజన్లకే పరిమితమై ఎన్నికలు జరిగాయని, గత రెండేళ్లుగా కార్పోరేషన్ ఎన్నికలకు ఆటంకం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఇటువంటి విలీనం సమస్యలు అధికంగా వున్నందున ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేపట్టే ఆలోచన ప్రభుత్వానికి వుందని మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ వెల్లడించిన అంశాలను ఉదహరించారు. రాబోయే ఏడాది ఆర్థిక సంఘం నిధులు వచ్చే విధంగా ప్రభుత్వ ప్రక్రియలు అమలవుతాయని పేర్కొన్నారు. రమణరాజు మాట్లాడుతూ 5వ తేదీన దీక్ష చేపట్టిన వెంటనే కలెక్టర్ స్పందించి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియజేసి దీక్షా శిబిరానికి అర్ధరాత్రి వేళ డి.ఆర్.వో జె.వెంక ట్రావును పంపించి చర్చలు జరపడం, ప్రభుత్వానికి పంపిన 4పేజీల నివేదిక అందించడం, నగరానికి వచ్చిన మున్సిపల్ మంత్రి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళడం, నేరుగా దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం అందించి పబ్లిక్ డిమాండ్ దీక్షను విరమింపజేయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘీభావం తెలిపిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాలకు, 8 విలీన గ్రామాల ప్రజలకు, మాజీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో పౌర సంఘం డెస్క్ మీటింగ్ నిర్వహించి సదస్సు నిర్వహణ విలీన గ్రామాలతో కార్పోరేషన్ ఎన్నికల ప్రక్రియ వచ్చే వరకు నిరంతర పాదయాత్ర ద్వారా ప్రజాచైతన్య క్రియాశీల కార్యాచరణ చేపట్టేందుకు అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుంటామని ప్రకటించారు. చింతపల్లి అజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, తొట్టెంపూడి రాజా, తటవర్తి సుబ్బారావు, జోగా అప్పారావు, ఎం.విజయకుమార్, భషీరుద్దీన్, హాసన్, షరీఫ్, జుత్తుక శ్రీనివాసరావు, సరగడ రాంబాబు, పెంకె నూకరాజు, ర్యాలి రవికిరణ్, మడ్డు బాబ్జీ, డి.ఎన్.మూర్తి, సలాది శ్రీనివాసబాబు, దువ్వూరి సుబ్రహ్మణ్యం, చోడిపల్లి సత్య ప్రసాద్, జే.డి.పవన్ కుమార్, కుక్కల పోతురాజు యాదవ్, పిల్లారిశెట్టి రాజేశ్వరి, కముజు నెహ్రూ, జి.శ్రీనివాసరావు, జానపాముల నాగబాబు, రాధ, తాళ్లూరి రాజు, గుబ్బల ఆదినారాయణ, కడియాల మూర్తి, పోలాబత్తుల శ్రీనివాసరావు, ఏడుకొండలు, నరసింహరావు, బలరామ మూర్తి, నాగబాబు, ఏసు, ఆనంద్, రాజారావు, రామకృష్ణారావు, శ్రీనివాస చౌదరీ, మహేష్ కుమార్, చైతన్య, కాకిలేటి రవీంద్ర, మున్నగు వారు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :