కరీంనగర్ జిల్లా: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ అన్నారు. గన్నేరువరం మండలం కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చట్టాలపై అవగాహన కల్పించుట కొరకు జాతీయ న్యాయ సేవాదికారి సంస్థ కరీంనగర్ ఆధ్వర్యంలో గురువారం సమావేశం ను ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ వాహనాలు చట్టం, మొబైల్ ఫోన్ వినియోగంతో జరిగే అనర్ధాలను మరియు క్రమశిక్షణ ప్రాముఖ్యత ను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహేష్ ప్యానల్ అడ్వకేట్ సదానందం, పిఎల్వి కె.అంజయ్య, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.