ప్రకాశం జిల్లా చీమకుర్తి గరికమిట్టలోని గిరిజన బాలుర వసతి గృహం నందు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయప్రతాపరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఫుడ్ కమిషన్ చైర్మన్ విద్యార్థులకు అందించే ఆహారాన్ని రుచి చూసి వంట వారికి నాణ్యతను తెలియజేశారు. అలాగే స్టోర్ రూమ్ నందు ఉన్న కూరగాయలు, కోడిగుడ్లు, సరుకులు, వంట సామాగ్రి యొక్క నాణ్యతను, గడువు తేదీలను పరిశీలించారు. వసతి గృహంలో వంట వారికి ఆహారానికి సంబంధించి సలహాలు సూచనలు చేసారు . విద్యార్థులకు మంచి నాణ్యత గల ఆహారం అందించడం వలన ఆరోగ్యం, శారీరకంగా పుష్టి, చదువుపై ఏకాగ్రత ఉంటాయని, తద్వారా విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారని, చిన్నపాటి పొరపాటులను సరిచేసుకొని ముందుకు వెళ్లాలని సిబ్బందికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు ప్రిన్సిపాల్ ఎం ప్రవీణ్ కుమార్, ఏ టి డబ్ల్యూ దాసరి అమరసుబ్బయ్య, వసతి గృహ అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.