అనంతపురం జిల్లా గుత్తి పట్టణం జడ్ వీరారెడ్డి భవనం నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన సిపిఎం ప్రజా పోరు క్యాంపెను 8 నుండి 14 తారీకు వరకు నిర్వహించడం జరుగుతుంది అంటూ సిపిఎం ప్రజా పోరు కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వం ట్రూ యాప్ చార్జీల పేరుతో ప్రజల పైన భారాలు వేయడాన్ని ఉపసంహరించుకొని నిత్యవసర సరుకుల ధరలు తగ్గించి సూపర్ సిక్స్ లో భాగంగా ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని మద్యం నియంత్రణ అమలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేపట్టి నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేసి జిల్లాలోని సాగునీరు ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో 7 వేల కోట్లు నిధులు కేటాయించి పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ జమిలి ఎన్నికల ప్రతిపాదనను విరమించాలని సిపిఎం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మల్లికార్జున ఫిరోజ్ నాయక్ మద్దిలేటి రేవతి కవిత మారి రాము శ్యామల రంగమ్మ రామలక్ష్మి మల్లికా తదితరులు పాల్గొన్నారు