గత ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుందని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో పని తక్కువ… పబ్లిసిటీ ఎక్కువ అని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు రూ.6,500 కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తగ్గారని నారా లోకేశ్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కేజీ టు పీజీ విద్యా విధానంతో ఏపీ విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని అన్నారు. ఐదేళ్లలో ఏపీ విద్యా వ్యవస్థను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని వివరించారు.