ప్రకాశం జిల్లా, గిద్దలూరు తాలూకా ప్రభుత్వ చీఫ్ ఖాజీ షేక్ నాయబ్ రసూల్ ఈనెల 14వ తేదీన జరగబోయే బాలల దినోత్సవం సందర్భంగా, బాల్య వివాహాలు నివారించడంపై సమాజంలో అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమాలలో బాల్య వివాహాల వల్ల తలెత్తే నష్టాలు, బాలల హక్కుల పరిరక్షణ, మరియు వారి సమగ్రాభివృద్ధికి సంబంధించిన చట్టాలు, ప్రభుత్వ పథకాలు వివరించబడతాయి. గిద్దలూరులో కొంతమంది వ్యక్తులు డబ్బుల కోసం తప్పుడు రికార్డులు సృష్టించి, అక్రమంగా వివాహాలు నిర్వహిస్తున్నారని .. ఈ రకమైన వివాహాలు జరిపితే .. మా దృషష్ఠికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చెరించారు.